శుక్రవారం, 06 నవంబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

నా వనవాసం ఎప్పుడు ముగుస్తుంది?

1 గంట క్రితం

నా వనవాసం ఎప్పుడు ముగుస్తుంది? (టాప్‌ లో పెట్టండి) image 1
వెబ్ డెస్క్

ప్రచురించబడింది నవం 06, 2026, 07:20 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం

- రేణు దేశాయ్‌

పవన్‌ కల్యాణ్‌తో విడాకులు తీసుకుని 14 ఏళ్లు గడిచినా, తనను ఇప్పటికీ ఆయన మాజీ భార్యగానే చూస్తున్నారంటూ నటి రేణు దేశాయ్‌ ఆవేదన వ్యక్తం చేశారు. తాజాగా ఓ ఇంటర్వ్యూలో వ్యక్తిగత జీవితం, సోషల్‌ మీడియాలో ఎదురవుతున్న విమర్శలపై ఆమె స్పందించారు. ‘‘చాలామంది నా జీవితం ‘బద్రి’ సినిమాతోనే మొదలైందని అనుకుంటున్నారు. అంతకుముందు నాకు జీవితమే లేనట్టుగా చూస్తున్నారు. విడాకులు జరిగి 14 ఏళ్లు గడిచిపోయాయి. శ్రీరాముడు కూడా 14 ఏళ్లే వనవాసం చేశాడు. మరి నా వనవాసం ఎప్పుడు ముగుస్తుంది?’’ అని ప్రశ్నించారు.

2012లో విడాకులు మంజూరైన తర్వాత తాను సాధించిన విజయాలను కూడా ఆమె ప్రస్తావించారు. ఒక మరాఠీ సినిమాను నిర్మించానని, అది మంచి విజయం సాధించిందని తెలిపారు. మరో సినిమాకు కథ రాయడంతోపాటు నిర్మాణం, దర్శకత్వ బాధ్యతలూ చేపట్టానని, పలు డ్యాన్స్‌ షోలకు పనిచేశానని, కవితలు రాశానని చెప్పారు. ప్రస్తుతం సినిమాల్లో నటిస్తున్నానని పేర్కొంటూ, తనకంటూ ప్రత్యేక గుర్తింపు లేకపోతే ఇన్ని అవకాశాలు ఎలా వస్తాయని ప్రశ్నించారు. సోషల్‌ మీడియాలో తాను చేసే ప్రతి పనిపైనా విమర్శలు వస్తున్నాయని, చివరకు ఓ కుక్కను కాపాడినా తిడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. పవన్‌ కల్యాణ్‌ లేకపోతే తనకు జీవించే అర్హతే లేదన్నట్లుగా కొందరు మాట్లాడుతున్నారని అన్నారు. ఆమె వ్యాఖ్యలు ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో చర్చనీయాంశమయ్యాయి.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్