శుక్రవారం, 06 నవంబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

‘బ్లడీ రోమియో’కు శశ్వత్‌ సంగీతం

1 గంట క్రితం

‘బ్లడీ రోమియో’కు శశ్వత్‌ సంగీతం image 1
వెబ్ డెస్క్

ప్రచురించబడింది నవం 06, 2026, 07:00 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం

నాని కథానాయకుడిగా, చెఫ్‌ పాత్రలో నటిస్తున్న చిత్రం ‘బ్లడీ రోమియో’. ఈ సినిమాకు సంగీత దర్శకుడి మార్పు జరిగినట్లు సమాచారం. తొలుత ప్రవీణ్‌ లక్కరాజును ఎంపిక చేసిన చిత్రబృందం తాజాగా ఆయన స్థానంలో బాలీవుడ్‌ సంగీత దర్శకుడు శశ్వత్‌ సచ్‌దేవ్‌కు అవకాశం ఇచ్చినట్లు తెలుస్తోంది. ఇటీవల విడుదలైన ‘దురంధర్‌’ చిత్రానికి ఆయన అందించిన సంగీతం ఈ నిర్ణయానికి కారణమని సినీ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. తెలుగులో శశ్వత్‌కు ఇదే తొలి చిత్రం. దీంతో ‘బ్లడీ రోమియో’ సంగీతంపై ఆసక్తి పెరిగింది. సుజీత్‌ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమా షూటింగ్‌ వేగంగా సాగుతోంది. ఇప్పటికే ఢిల్లీలో తొలి షెడ్యూల్‌ పూర్తికాగా, త్వరలో హైదరాబాద్‌, లండన్‌లలో తదుపరి షెడ్యూళ్లు జరగనున్నాయి. నిహారిక ఎంటర్‌టైన్‌మెంట్స్‌ పతాకంపై వెంకట్‌ బోయినపల్లి నిర్మిస్తున్నారు.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్