ఆదివారం, 15 నవంబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

అనిల్‌ రావిపూడి–ఎన్టీఆర్‌ కాంబినేషన్‌లో ...

9 గంటల క్రితం

అనిల్‌ రావిపూడి–ఎన్టీఆర్‌ కాంబినేషన్‌లో ... image 1
వెబ్ డెస్క్

ప్రచురించబడింది నవం 14, 2026, 08:00 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం

ఎన్టీఆర్‌ కథానాయకుడిగా అనిల్‌ రావిపూడి దర్శకత్వంలో ఓ సినిమా తెరకెక్కనుంది. ఈ విషయాన్ని శనివారం ఎన్టీఆర్‌ ఎక్స్‌ వేదికగా వెల్లడించారు. అనిల్‌ రావిపూడితో కలిసి దిగిన ఫొటోను పంచుకుంటూ ‘నవ్వుల విందు సిద్ధమవుతోంది’ అని పేర్కొన్నారు. ఎన్టీఆర్‌ ఆర్ట్స్‌ పతాకంపై నందమూరి కల్యాణ్‌రామ్‌ ఈ చిత్రాన్ని నిర్మించనున్నారు. ప్రస్తుతం ప్రశాంత్‌ నీల్‌ దర్శకత్వంలో ఎన్టీఆర్‌ నటిస్తున్న ‘డ్రాగన్‌’ పూర్తయిన తర్వాత ఈ సినిమా ప్రారంభమయ్యే అవకాశం ఉంది. మరోవైపు అనిల్‌ రావిపూడి దర్శకత్వంలో వెంకటేశ్‌, కల్యాణ్‌రామ్‌ నటిస్తున్న ‘జనవరి 12న విడుదల’ చిత్రం 2027 సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకు రానుంది.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్