ఆదివారం, 15 నవంబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

అనుదీప్‌ కొత్త ప్రయాణం

11 గంటల క్రితం

అనుదీప్‌ కొత్త ప్రయాణం image 1
వెబ్ డెస్క్

ప్రచురించబడింది నవం 14, 2026, 06:15 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం

‘జాతిరత్నాలు’ సినిమాతో దర్శకుడిగా ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న అనుదీప్‌ కేవీ కొత్త ప్రయత్నానికి శ్రీకారం చుట్టారు. తన ఆలోచనలు, మాటలను పుస్తక రూపంలో తీసుకొచ్చారు. ‘లైఫ్‌ ఈజ్‌ బ్యూటీఫుల్‌’ పేరుతో ఓ పుస్తకాన్ని రచించారు. ఈ విషయాన్ని దర్శకుడు నాగ్‌ అశ్విన్‌ సోషల్‌ మీడియా వేదికగా వెల్లడించారు. ‘మన జాతిరత్నం ఓ పుస్తకం రాశారు’ అంటూ అనుదీప్‌ ఆ పుస్తకంతో ఉన్న ఫొటోను సోషల్‌ ‌మీడియాలో పంచుకున్నారు. ఈ పుస్తకంపై అనుదీప్‌ ఓ క్యాప్షన్‌ ఇచ్చారు. ‘ఈ పుస్తకం చదివాక ఏదో ఒక గొప్ప విషయాన్ని తెలుసుకుంటారు. లేదంటే రచయిత కంటే మీకే ఎక్కువ తెలుసని సంతోషపడతారు’ అంటూ తనదైన శైలిలో చమత్కరించారు.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్