శనివారం, 14 నవంబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

భర్తను కాపాడే లాయర్‌గా ...

12 గంటల క్రితం

భర్తను కాపాడే లాయర్‌గా ... image 1
వెబ్ డెస్క్

ప్రచురించబడింది నవం 13, 2026, 05:15 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం

నటి కీర్తి సురేశ్‌ ప్రధాన పాత్రలో నటించిన తాజా చిత్రం 'సత్యవాన్‌ సావిత్రి'. ప్రవీణ్‌ ఎస్‌. విజయ్‌ దర్శకత్వం వహించిన ఈ చిత్రం కామెడీ, కోర్టు డ్రామా అంశాలతో తెరకెక్కింది. నవంబర్‌ 20న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో చిత్రబృందం తాజాగా ట్రైలర్‌ను విడుదల చేసింది. ఈ సినిమాలో కీర్తి సురేశ్‌ న్యాయవాది పాత్రలో కనిపించనున్నారు. ఇష్టంలేని వివాహం చేసుకున్న భర్త ఒక హత్య కేసులో చిక్కుకోవడంతో కథలో ప్రధాన మలుపు మొదలవుతుంది. అతడిని కేసు నుంచి బయటపడేయడానికి భార్యగా, న్యాయవాదిగా ఆమె చేసే ప్రయత్నాల చుట్టూ కథనం సాగుతుంది. వివాహ బంధం, న్యాయస్థానంలో జరిగే పరిణామాలు, హాస్య సన్నివేశాలను కలిపి ఈ చిత్రాన్ని రూపొందించినట్లు ట్రైలర్‌ సూచిస్తోంది.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్