యువ నటుడు అశోక్ గల్లా, శ్రీ గౌరీ ప్రియ జంటగా నటిస్తున్న చిత్రం ‘వీసా– వింటారా సరదాగా’. ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా జనవరి 1, 2027న థియేటర్లలో విడుదలకు సిద్ధమవుతోంది. ఉద్భవ్ రఘు దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం అమెరికా నేపథ్యంలో సాగనుంది. ఉన్నత చదువులు, పెద్ద కలలతో స్వదేశాన్ని వీడి అమెరికాకు వెళ్ళిన తెలుగు విద్యార్థుల జీవితాల చుట్టూ ఈ కథనం తిరుగుతుంది. విదేశాల్లో విద్యార్థుల జీవనశైలి, వారి స్నేహాలు, ప్రేమలు, అనుకోని పరిణామాలు ఎదురయ్యే ఆసక్తికరమైన సంఘటనలను ఈ చిత్రంలో చూపించారు. విజయ్ బుల్గానిన్ ఈ సినిమాకు సంగీతం అందించారు. రాహుల్ విజయ్, శివాత్మిక రాజశేఖర్, సత్య, వివా హర్ష, గుండు సుదర్శన్ తదితరులు ఈ చిత్రంలో కీలక పాత్రలు పోషిస్తున్నారు. ప్రముఖ నిర్మాణ సంస్థలు సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్‌పై సూర్యదేవర నాగవంశీ, ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్‌పై సాయి సౌజన్య సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.
జనవరి 1న అశోక్ గల్లా ‘విసా..’
10 గంటల క్రితం

వెబ్ డెస్క్
ప్రచురించబడింది నవం 14, 2026, 07:00 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం
ట్యాగ్లు
సంబంధిత వార్తలు







కామెంట్లు (0)