ఆదివారం, 15 నవంబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

27న ‘బాల 369’ విడుదల!

10 గంటల క్రితం

27న ‘బాల 369’ విడుదల! image 1
వెబ్ డెస్క్

ప్రచురించబడింది నవం 14, 2026, 07:30 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం

సుమ ప్రధాన పాత్రలో వచ్చిన ‘జయమ్మ పంచాయితీ’ దర్శకుడు విజయ్ కుమార్ కలివరపు తెరకెక్కించిన కొత్త చిత్రం ‘బాల 369’. ఆర్విన్ తేజ్ హీరోగా నటించిన ఈ సినిమా టీజర్ కామెడీ ఎంటర్‌టైన్‌మెంట్‌తో ఆకట్టుకుంటోంది. నవంబర్ 27న ఈ చిత్రం విడుదల కానుంది.‘అనిజని కంచె’ అనేది ఈ సినిమా ట్యాగ్‌ లైన్‌. తాజాగా ఈ సినిమా టీజర్‌ను విడుదల చేశారు. ఆర్విన్ తేజ్‌తో పాటు వెన్నెల కిషోర్, వైవా హర్ష, గెటప్ శ్రీను, సమీరా భరద్వాజ్, జీవన్ తదితరులు ఈ చిత్రంలో నటించారు. ఈ చిత్రానికి అనుష్ కుమార్ సినిమాటోగ్రఫీ అందిస్తుండగా, డా. శాండీ సి. ఆనంద్ సంగీతం సమకూరుస్తున్నారు. కార్తికేయన్ రోహిణి ఎడిటర్‌గా పనిచేస్తున్నారు.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్