బాలీవుడ్ ప్రముఖ నటుడు సునీల్ ఆనంద్ (70) కన్నుమూశారు. లండన్‌లో ఓ ఆసుపత్రిలో గుండెపోటుతో మంగళవారం (జూలై 28) మృతి చెందారు. ఈ విషయాన్ని ఆయన మేనకోడలు జీనా నారంగ్ ప్రకటించారు. ఈయన ప్రముఖ బాలీవుడ్ నటుడు, దర్శకుడు దేవ్ ఆనంద్, నటి కల్పనా కార్తీక్‌ల కుమారుడు. సునీల్ ఆనంద్ తండ్రి దర్శకత్వంలో తెరకెక్కిన 'ఆనంద్ ఔర్ ఆనంద్' చిత్రంతో నటుడిగా అరంగేట్రం చేశారు. ఆ తర్వాత 'కార్ థీఫ్', 'మైన్ తేరే లియే' వంటి చిత్రాల్లో నటించారు. స్వీయ దర్శకత్వంలో తెరకెక్కిన 'మాస్టర్' చిత్రంలోనూ నటించారు.
Print Editionబాలీవుడ్ నటుడు సునీల్ ఆనంద్ కన్నుమూత
1 గంట క్రితం

వెబ్ డెస్క్
ప్రచురించబడింది జులై 29, 2026, 08:23 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం
ట్యాగ్‌లు
సంబంధిత వార్తలు







కామెంట్‌లు (0)