శనివారం, 04 జులై 2026E-PAPER
మ్యాగజైన్స్

'చెన్నై లవ్ స్టోరీ' చిత్ర యూనిట్‌ సందడి

2 గంటల క్రితం

love story
వెబ్ డెస్క్

ప్రచురించబడింది జులై 04, 2026, 07:05 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం

'చెన్నై లవ్ స్టోరీ' చిత్ర యూనిట్ శనివారంనాడు విజయవాడలో సందడి చేసింది. నటీనటులు కిరణ్ అబ్బవరం, శ్రీగౌరీ ప్రియతో పాటు చిత్రంలోని పలువురు నటీనటులు పాల్గొన్నారు. ఈ నెల 24న సినిమా విడుదల కానున్న నేపథ్యంలో ప్రచార కార్యక్రమంలో భాగంగా విజయవాడకు వచ్చారు. రవి నంబూరి దర్శకత్వం వహించిన ఈ చిత్రానికి సాయి రాజేష్ కథ అందించగా, మణిశర్మ సంగీతం సమకూర్చారు. మాస్ మూవీ మేకర్స్, అమృత ప్రొడక్షన్స్ బ్యానర్లపై ఎస్.కె.ఎన్., సాయి రాజేష్ నిర్మించారు. విజయవాడలోని రాజ్ యువరాజ్ థియేటర్‌లో 'లవ్ కార్నివల్' పేరుతో నిర్వహించిన కార్యక్రమానికి అభిమానులు, యువత హాజరయ్యారు. ఈ సందర్భంగా కిరణ్ అబ్బవరం మాట్లాడుతూ, 'చెన్నై లవ్ స్టోరీ'లో ప్రతి పాత్ర సహజంగా ఉంటుందని, స్వచ్ఛమైన ప్రేమకథగా తెరకెక్కిన ఈ చిత్రం అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకుంటుందనే ఆశాభావం వ్యక్తం చేశారు. సినిమా చూసిన ప్రేక్షకులకు మంచి అనుభూతి కలుగుతుందని చెప్పారు. శ్రీగౌరీ ప్రియతో పాటు చిత్రబృందంలోని ఇతర సభ్యులు కూడా పాల్గొన్నారు.



ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్