న్యూఢిల్లీ : ప్రస్తుత పరీక్షా విధానంలో సంస్కరణలపై సిఫార్సులు చేయడానికి ఉడాయ్ మాజీ చైర్మన్, ఇన్ఫోసిస్ సహ వ్యవస్థాపకులు నందన్ నీలేకని నేతృత్వంలో హైపవర్డ్ టాస్క్‌ఫోర్స్‌ను కేంద్రం ప్రభుత్వం ఏర్పాటు చేసింది. ఈ విషయాన్ని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఆదివారం ఒక వీడియోలో వెల్లడించారు. ‘‘ఐదుగురు సభ్యులు గల ఈ టాస్క్‌ఫోర్స్ పరీక్షల సంస్కరణలపై దృష్టి పెడుతుంది. కమిటీ నివేదిక ఆధారంగా భవిష్యత్‌లో పరీక్షల నిర్వహణపై ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుంది. పేపర్ లీక్‌లు అరికట్టేందుకు కఠినమైన చట్టం తీసుకొస్తున్నాం. దీనికి సంబంధించిన బిల్లును సోమవారం పార్లమెంట్‌లో ప్రవేశపెడతాం. విశ్వసనీయమైన, పారదర్శకమైన పరీక్ష విధానం అమలు చేస్తాం’’ అని ఈ వీడియోలో తెలిపారు. నందన్ నీలేకనితో పాటు యస్. సోమనాథ్ (ఇస్రో మాజీ ఛైర్మన్), తపన్ డేకా (ఇంటెలిజెన్స్ బ్యూరో మాజీ డైరెక్టర్), వి. కామకోటి (ఐఐటీ మద్రాస్ డైరెక్టర్), అనితా కర్వాల్ (కేంద్ర విద్యాశాఖ మాజీ కార్యదర్శి), అమృత్ లాల్ మీనా (లాజిస్టిక్స్, పరిపాల నా నిపుణుడు) టాస్క్‌ఫోర్స్‌లో సభ్యులుగా ఉంటారు.
పరీక్షల సంస్కరణలపై నందన్ నీలేకని నేతృత్వంలో టాస్క్‌ఫోర్స్
1 గంట క్రితం

వెబ్ డెస్క్
ప్రచురించబడింది జులై 27, 2026, 12:18 పూర్వాహ్నం | 1 నిమిషాల చదవడం
ట్యాగ్‌లు
సంబంధిత వార్తలు






కామెంట్‌లు (0)