నితిన్, ఆఫియా సయ్యద్ జంటగా నటిస్తోన్న తాజా చిత్రం '‘అలియాస్ రుక్మిణి’. 'దండోరా` ఫేమ్ మురళీకాంత్ దేవసోత్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ మూవీ కేవలం 98 రోజుల్లోనే షూటింగ్ పూర్తి చేసుకుంది. ఈ విషయాన్ని తాజాగా మూవీ మేకర్స్ వెల్లడించారు. ఈ సందర్భంగా మరో 25 రోజుల్లో డిసెంబర్ 4న థియేటర్లలో చెప్పలేని భావోద్వేగాలతో అందమైన చిత్రాన్ని చూద్దాం అని మేకర్స్ ప్రకటించారు. దీప్తి గంటా యూనానిమస్ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై నిర్మిస్తున్న ఈ చిత్రానికి హీరో నాని సమర్పకులుగా వ్యవహరిస్తున్నారు. ఇప్పటికే ఈ చిత్రం నుంచి విడుదలైన గ్లింప్స్, పాట విశేషంగా ఆకట్టుకుంది.







కామెంట్లు (0)