గురువారం, 13 ఆగస్టు 2026E-PAPER
మ్యాగజైన్స్

తొలి సినిమాతోనే ‘విస్మయం’

1 గంట క్రితం

thudakkam
వెబ్ డెస్క్

ప్రచురించబడింది ఆగ 13, 2026, 09:13 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం

మలయాళ స్టార్‌ మోహన్‌లాల్‌ కూతురు విస్మయ మోహన్‌లాల్‌ కథానాయికగా పరిచయమైన ‘తుడక్కం’ చిత్రం బాక్సాఫీస్‌ వద్ద మంచి వసూళ్లు సాధిస్తోంది. జాడే ఆంథని జోసెఫ్‌ దర్శకత్వం వహించిన ఈ యాక్షన్‌, సర్వైవల్‌ థ్రిల్లర్‌ కేరళతో పాటు ఓవర్సీస్‌ మార్కెట్‌లోనూ ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నట్లు ట్రేడ్‌ వర్గాలు చెబుతున్నాయి. విడుదలైన ఆరు రోజుల్లో కేరళలో రూ.15 కోట్ల గ్రాస్‌ వసూలు చేసినట్లు సమాచారం. ఓవర్సీస్‌ మార్కెట్‌లో మరో రూ.15 కోట్ల గ్రాస్‌ సాధించినట్లు తెలుస్తోంది. దీంతో ఆరు రోజుల్లోనే ప్రపంచవ్యాప్తంగా రూ.30 కోట్లకు పైగా గ్రాస్‌ రాబట్టినట్లు ట్రేడ్‌ వర్గాల అంచనా. తొలి సినిమాతోనే విస్మయ ఈ స్థాయి వసూళ్లు సాధించడం విశేషంగా మారింది.


ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్