బుధవారం, 02 సెప్టెంబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

Print Editionఆన్‌‌లైన్‌ బెట్టింగ్ కేసు పేమెంట్‌ కంపెనీల్లో ఇడి సోదాలు

1 గంట క్రితం

ed raids.webp
వెబ్ డెస్క్

ప్రచురించబడింది సెప్టెం 03, 2026, 12:09 పూర్వాహ్నం | 1 నిమిషాల చదవడం

ముంబయి : ఆన్‌‌లైన్‌ బెట్టింగ్‌ ‌కేసు విచారణలో భాగంగా ఇడి బుధవారం వివిధ పేమెంట్‌ కంపెనీలు, చార్టర్డ్ అకౌంటెంట్లు, కంపెనీ కార్యదర్శల ప్రాంగణాలు, నివాసాల్లో సోదాలు నిర్వహించింది. దేశవ్యాప్తంగా మొత్తం 14 ప్రదేశాల్లో ఈ సోదాలు నిర్వహించినట్లు అధికారులు తెలిపారు. మహారాష్ర్టలోని ఐదు, ఢిల్లీలోని నాలుగు, రాజస్థాన్‌‌లోని రెండు, గుజరాత్‌‌, మధ్యప్రదేశ్‌, జమూకాశ్మీర్‌‌లోని ఒకొక్క ప్రాంతంలో ఈ సోదాలు జరిగాయి.

ముంబయిలో సైబర్‌ క్రైమ్‌ ‌పోలీసులు నమోదు చేసిన ఎఫ్‌ఐఆర్‌ ఆధారంగా ఆన్‌‌లైన్‌ బెట్టింగ్‌‌ సంస్థ పారిమ్యాచ్‌, ‌ ఇతరులపై మనీలాండరింగ్‌ ‌చట్టం కింద ఇడి విచారణ నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. పారిమ్యాచ్ నుంచి బెట్టింగ్ ద్వారా వచ్చిన డబ్బును పేమెంట్ కంపెనీలు చార్టర్డ్ అకౌంటెంట్లు, కంపెనీ కార్యదర్శల సహాయంతో అక్రమంగా విదేశాలకు తరలించినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్నాయి. కాగా మరో బృందం జాతీయ రహదారుల వెంబడి ఉన్న టోల్‌ప్లాజాల అక్రమాలకు సంబంధించిన వ్యవహారాలో పలు రాష్ర్టాల్లో ఆయా నిర్వహణ సంస్థల కార్యాలయాలపై సోదాలు చేపట్టింది.


ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్