'జురాసిక్ పార్క్', 'క్యాచ్ మీ ఇఫ్ యూ కెన్', 'మ్యూనిచ్', 'ద టెర్మినల్', 'ఇండియానా జోన్స్' తదితర సినిమాలతో అద్భుతమైన గుర్తింపు సాధించిన స్టీవెన్ స్పీల్‌బర్గ్ తీసిన తాజా సైన్స్ ఫిక్షన్ మిస్టరీ థ్రిల్లర్ మూవీ 'డిస్‌క్లోజర్ డే'. గత నెల 12న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదలైంది. ఏలియన్స్ కాన్సెప్ట్‌తో రూపొందిన ఈ చిత్రం ఇప్పుడు విదేశాల్లో అమెజాన్ ప్రైమ్ ఓటీటీలోకి వచ్చేసింది. అద్దె విధానంలో ఇంగ్లీష్, హిందీ భాషల్లో ఈ చిత్రం ప్రస్తుతం స్ట్రీమింగ్ అవుతోంది. ఓ సైబర్ సెక్యూరిటీ విజిల్‌బ్లోయర్ డేనియల్ (జోష్ ఓ'కానర్), వాతావరణ శాస్త్రవేత్త మార్గెట్ (ఎమిలీ బ్లంట్).. అమెరికా ప్రభుత్వం దాచిపెట్టిన గ్రహాంతరవాసుల రహస్య ఆధారాలను బయటపెట్టాలనుకుంటారు. ఈ క్రమంలోనే ఏజెన్సీ చీఫ్ నోవా (కోలిన్ ఫెర్త్) నుంచి వీళ్లిద్దరూ ఎలాంటి సవాళ్లు ఎదుర్కొన్నారు? చివరకు ఏమైందనేదే మిగతా కథ. గ్రహాంతరవాసులు నిజంగానే భూమిపైకి వస్తే మానవాళి ఎలా స్పందిస్తుందనేది ఇందులో చూపించే ప్రయత్నం చేశారు.
ఓటీటీలో ‘డిస్‌క్లోజర్ డే’
2 గంటల క్రితం

వెబ్ డెస్క్
ప్రచురించబడింది జులై 21, 2026, 09:01 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం
ట్యాగ్‌లు
సంబంధిత వార్తలు







కామెంట్‌లు (0)