వెంకటేష్, కళ్యాణ్ రామ్, కీర్తి సురేష్, కృతిశెట్టి ప్రధాన పాత్రల్లో నటిస్తున్న చిత్రం ‘జనవరి 12 విడుదల’. ‘బావ బామ్మర్ది సౌజన్యంతో’ అనే ట్యాగ్‌లైన్‌తో అనిల్ రావిపూడి దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమా వచ్చే ఏడాది సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో చిత్రబృందం మ్యూజికల్ ప్రమోషన్స్ ప్రారంభించింది. శనివారం వదిన, మరదళ్లపై రూపొందించిన ‘డివికి డివికి’ పాటను విడుదల చేసింది. అనంత్ శ్రీరామ్ సాహిత్యం అందించిన ఈ పాటను మధుప్రియ, హరిప్రియ ఆలపించారు. షైన్ స్క్రీన్స్ బ్యానర్‌పై సాహు గారపాటి నిర్మిస్తున్న ఈ చిత్రానికి జీవీ ప్రకాష్ కుమార్ సంగీతం అందిస్తున్నారు.
‘డివికి డివికి’ పాట విడుదల
7 గంటల క్రితం

వెబ్ డెస్క్
ప్రచురించబడింది నవం 21, 2026, 07:05 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం
ట్యాగ్‌లు
సంబంధిత వార్తలు







కామెంట్‌లు (0)