శుక్రవారం, 03 జులై 2026E-PAPER
మ్యాగజైన్స్

'మా ఇంటి బంగారం` పై అక్కినేని అఖిల్ ఏమన్నారంటే ...

12 గంటల క్రితం

'మా ఇంటి బంగారం` పై అక్కినేని అఖిల్ ఏమన్నారంటే ...
వెబ్ డెస్క్

ప్రచురించబడింది జులై 03, 2026, 11:21 పూర్వాహ్నం | 1 నిమిషాల చదవడం

హైదరాబాద్ : అక్కినేని యంగ్ హీరో అఖిల్ నటిస్తున్న తాజా చిత్రం ‘లెనిన్‌’. ఈ సినిమా జులై 10న ప్రపంచవ్యాప్తంగా విడుదల కాబోతున్న నేపథ్యంలో వ‌రుస ప్ర‌మోష‌న్స్‌లో అఖిల్ పాల్గొంటున్నారు. ఇక చిత్ర ప్రచారంలో భాగంగా ఇచ్చిన ఓ తాజా ఇంటర్వ్యూలో ఆయన టాలీవుడ్ రీసెంట్‌ ఇండస్ట్రీ హిట్‌ ‘మా ఇంటి బంగారం’ సినిమా గురించి అందులో సమంత నటన గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. లెనిన్’ ప్రమోషన్స్ బిజీ వల్ల తాను ఇంకా ‘మా ఇంటి బంగారం’ సినిమా చూడలేదని, కానీ ఆ చిత్ర ట్రైలర్ చూశానని అఖిల్ వెల్లడించారు. ట్రైలర్ వైబ్ అద్భుతంగా ఉందని, చూసినప్పుడే ఇది కచ్చితంగా పెద్ద హిట్ అవుతుందని తనకు అనిపించిందని చెప్పారు. ఒక మంచి ఇంటికి కోడలిగా వెళ్లి, ఆ కుటుంబ సభ్యులందరితో బంగారం అనిపించుకోవాలనే చక్కటి ఫ్యామిలీ ఎలిమెంట్‌కు పవర్‌ఫుల్ యాక్షన్‌ను జోడించి సినిమాను చాలా కొత్త కాన్సెప్ట్‌తో, సహజంగా తెరకెక్కించారని ఆయన ప్రశంసించారు. ముఖ్యంగా ఒక మహిళా ప్రధాన పాత్రతో ఆ స్థాయి యాక్షన్ సీన్స్ చేయించడం నిజంగా అద్భుతమని కొనియాడారు. ఈ చిత్రంలో సమంత పాత్రను అద్భుతంగా పండించిందని మెచ్చుకుంటూ, కంగ్రాట్స్ సామ్ అంటూ సమంతతో పాటు ‘మా ఇంటి బంగారం’ చిత్రబృందానికి అఖిల్ తన ప్రత్యేక అభినందనలు తెలియజేశారు.


జూన్‌ ఓ గొప్ప నెల : సమంత

ఇక జూన్‌ నెల తనకు ఎంతో నచ్చిందన్నారు సమంత. ‘అద్భుతమైన కథ’ అంటూ జూన్‌కు సంబంధించిన కొన్ని ఫొటోలను ఇన్‌స్టా వేదికగా పోస్ట్‌ చేశారు. ఆమె సుదీర్ఘ విరామం తర్వాత నటించిన ‘మా ఇంటి బంగారం’ జూన్‌లోనే విడుదలైంది. ఈ చిత్రం మంచి ప్రేక్షకాదరణను సొంతం చేసుకుంటోంది. ఈ టికెట్ సేల్స్‌కు సంబంధించిన ఫొటోలతో పాటు ప్రెగ్నెన్సీ సమయంలో వర్క్‌వుట్‌లు చేస్తోన్న వీడియోను పంచుకున్నారు.




ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్