శుక్రవారం, 30 అక్టోబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

‘క్రిస్మస్‌కు జుమాంజి : ఓపెన్ వరల్డ్‌’

1 గంట క్రితం

‘క్రిస్మస్‌కు జుమాంజి: ఓపెన్ వరల్డ్‌’ image 1
వెబ్ డెస్క్

ప్రచురించబడింది అక్టో 30, 2026, 07:09 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం

హాలీవుడ్‌ అడ్వెంచర్‌ ఫాంటసీ ఫ్రాంచైజీ ‘జుమాంజి’లో చివరి చిత్రంగా ప్రచారంలో ఉన్న ‘జుమాంజి: ఓపెన్‌ వరల్డ్‌’ డిసెంబర్‌ 25న క్రిస్మస్‌ కానుకగా ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. ఈ నేపథ్యంలో సోనీ పిక్చర్స్‌ తాజాగా తెలుగు ట్రైలర్‌ను విడుదల చేసింది. విజువల్‌ ఎఫెక్ట్స్‌, యాక్షన్‌, అడ్వెంచర్‌ అంశాలతో సాగిన ట్రైలర్‌ ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది. ‘జుమాంజి’ వీడియో గేమ్‌ ఆడేవారు అందులోని పాత్రల్లోకి ప్రవేశించిన తర్వాత ఎదుర్కొనే పరిణామాలు, సాహసాలు ఆసక్తిని రేకెత్తిస్తున్నాయి. జేక్‌ కస్డాన్‌ దర్శకత్వం వహించిన ఈ చిత్రం పిల్లలతోపాటు కుటుంబ ప్రేక్షకులనూ అలరించేలా ఉండబోతోందని ట్రైలర్‌ సూచిస్తోంది.



ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్