ప్రజాశక్తి- కవిటి
తుపాను దెబ్బకు నీట మునిగి దిక్కుతోచని స్థితిలో ఉన్న కవిటి, పుటియదల రైతులకు ఊరట లభించింది. వందలాది ఎకరాల్లో నిలిచిన వరద నీటిని బయటకు మళ్లించేందుకు ప్రభుత్వ విప్ బెందాళం అశోక్ చొరవ తీసుకున్నారు. ఇందులో భాగంగా శుక్రవారం పొగురు తవ్వి నీటిని సముద్రంలోకి మళ్లించే పనులు చేపట్టారు. కొన్ని గంటల శ్రమతో నీరు బయటకు వెళ్లే మార్గం సుగమమైంది. దీంతో ముంపు నుంచి పంటలు బయటపడతాయన్న ఆశ రైతుల్లో చిగురించింది. పొగురు పారడంతో ఊపిరి పీల్చుకున్న రైతులు ఆశతో ఇంటిబాట పట్టారు.








కామెంట్‌లు (0)