శుక్రవారం, 30 అక్టోబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

బొబ్బిలంక వంతెన వద్ద వరద ఉధృతి పరిశీలన

1 గంట క్రితం

బొబ్బిలంక వంతెన వద్ద వరద ఉధృతి పరిశీలన image 1
వెబ్ డెస్క్

ప్రచురించబడింది అక్టో 30, 2026, 08:23 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం

​ప్రజాశక్తి-సీతానగరం

మండలంలోని పంటపొలాల్లో వరద ఉధృతి ఎక్కువగా ఉన్న నేపథ్యంలో అధికారుల బృందం క్షేత్రస్థాయిలో పర్యటించింది. కోరుకొండ ఎడిఎ డి.శ్రీనివాస్, తహశీల్దార్ ఎ.శ్రీనివాస్, ఇరిగేషన్ ఎఇ, ఎఇ, డిప్యూటీ ఎంపీడీఓలతో కూడిన బృందం శుక్రవారం బొబ్బిలంక వంతెన వద్ద నీటి ప్రవాహాన్ని నిశితంగా పరిశీలించింది. ఈ సందర్భంగా ఎడిఎ డి.శ్రీనివాస్ మాట్లాడుతూ ఎగువ ప్రాంతాల్లో ఉన్న ముంపు నీరంతా ఈ కాలువ ద్వారానే గోదావరి నదిలోకి కలవాల్సి ఉంటుందని, ఆ పరిస్థితులను క్షుణ్ణంగా పరిశీలించామని తెలిపారు. అనంతరం ఇరిగేషన్ ఎఇ మాట్లాడుతూ పంట పొలాలను ముంచెత్తిన వరద నీరు బొబ్బిలంక వంతెన గుండా పూర్తిగా గోదావరిలోకి వెళ్ళడానికి ఇంకా మూడు నుండి నాలుగు రోజుల సమయం పడుతుందని అంచనా వేశారు. రాబోయే రోజుల్లో ఉన్న తుపాను ముప్పును కూడా దృష్టిలో ఉంచుకుని, కోతకు వచ్చిన వరి పంటను రైతులు తగిన జాగ్రత్తలు తీసుకుంటూ త్వరగా కోసుకోవాలని అధికారులు ఈ సందర్భంగా సూచించారు.

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్