ప్రజాశక్తి-గన్నవరం :
ఇటీవల సంభవించిన తుపాను ప్రభావంతో ఉంగుటూరు మండలంలో నిర్వాసితులైన బాధితులకు తహసీల్దార్ జాలాది విమల కుమారి శుక్రవారం నిత్యావసరాలు, నగదు పరిహారం అందజేశారు. మండలంలోని మానికొండ, కొయ్యగూరపాడు తదితర గ్రామాల్లో ఆమె స్వయంగా పర్యటించి బాధితులను పరామర్శించారు. ఈ సందర్భంగా తుపాను బాధిత కుటుంబాలకు తక్షణ సాయంగా రూ. 1,000 నగదుతో పాటు 25 కిలోల చొప్పున బియ్యాన్ని పంపిణీ చేశారు. తుపాను కారణంగా నష్టపోయిన ప్రతి కుటుంబాన్నీ ప్రభుత్వం అన్ని విధాలా ఆదుకుంటుందని, ఎవరూ అధైర్యపడవద్దని తహసీల్దార్ తెలిపారు.








కామెంట్‌లు (0)