కిరణ్ అబ్బవరం హీరోగా వీర కొగటం దర్శకత్వంలో ఓ సినిమా తెరకెక్కుతోంది. ఈ చిత్రానికి 'రికార్డు' అనే టైటిల్‌ను ఖరారు చేశారు. సోమవారం అన్నపూర్ణ స్టూడియోలో సినిమా పూజా కార్యక్రమాలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఫస్ట్ లుక్ పోస్టర్‌ను విడుదల చేశారు. పోస్టర్‌లో ఎర్రటి చంద్రుడి నేపథ్యంలో కిరణ్ అబ్బవరం, గుర్రం, కోడి ఈకలు కనిపిస్తున్నాయి. వంశీ నందిపాటి ఎంటర్‌టైన్‌మెంట్స్, సుకుమార్ రైటింగ్స్, థీ స్టోరీస్ బ్యానర్లపై వంశీ నందిపాటి, అశోక్ బండ్రెడ్డి సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ సందర్భంగా కిరణ్ అబ్బవరం మాట్లాడుతూ.. 'క' సినిమా తర్వాత నిర్మాత వంశీతో కలిసి చేస్తున్న చిత్రమిది. దర్శకుడు వీర జర్నలిస్టుగా పనిచేశారు. త్వరలో మరిన్ని వివరాలు తెలియజేస్తాం' అని అన్నారు.
కిరణ్ అబ్బవరం కొత్త సినిమా 'రికార్డు'
47 నిమిషాల క్రితం

వెబ్ డెస్క్
ప్రచురించబడింది నవం 23, 2026, 07:00 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం
ట్యాగ్‌లు
సంబంధిత వార్తలు






కామెంట్‌లు (0)