సోమవారం, 23 నవంబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

'ది ఇండియన్ బోర్డర్’ షూటింగ్ పూర్తి

2 గంటల క్రితం

'ది ఇండియన్ బోర్డర్’ షూటింగ్ పూర్తి image 1
వెబ్ డెస్క్

ప్రచురించబడింది నవం 23, 2026, 05:34 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం

కిరణ్ యార్లగడ్డ, ఆదర్ష్, మురళీ మోహన్, మేఘా శ్రీ, సిందు తులాని ముఖ్య పాత్రలు పోషించిన 'ది ఇండియన్ బార్డర్' సినిమా చిత్రీకరణ పూర్తయింది. డి.ఎస్. భాషా దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రాన్ని హార్ట్ క్రియేషన్స్ బ్యానర్‌పై నివేద్య రెడ్డి నిర్మిస్తున్నారు. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకుని ఈ దేశభక్తి చిత్రం త్వరలో విడుదల కానుంది. ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన 'జిందా రహేన్ తో డ్యూటీ' పాటకు మంచి స్పందన లభించింది. ఇటీవల విడుదలైన పోస్టర్‌లో భారత్, పాకిస్తాన్ సరిహద్దుల్లో విధులు నిర్వహించే సైనికుల వేషధారణలో పాత్రలు కనిపిస్తున్నాయి. ఈ చిత్రానికి నలినికాంత్ కొండపల్లి కెమెరామెన్‌గా, కె. రమేష్ ఎడిటర్‌గా పనిచేశారు.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్