అమెరికాలో ఉద్యోగం కొనసాగిస్తూనే తెలుగు సినిమాపై ఆసక్తితో దర్శకత్వం చేపట్టిన రమేష్ బాబు చెరుకూరు రూపొందించిన చిత్రం 'సిద్ధుగాడి లవ్ స్టోరీ'. శివ బ్రహ్మేంద్ర క్రియేషన్స్ పతాకంపై బాల బ్రహ్మచారి చెరుకూరు, శివ బ్రహ్మిణి చెరుకూరు సమర్పణలో సావిత్రమ్మ చెరుకూరు ఈ చిత్రాన్ని నిర్మించారు. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ సినిమా ఈ నెల 27న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ చిత్రంలో మనోజ్ హీరోగా, శృతి, మోహన సిద్ధి హీరోయిన్లుగా నటించారు. సుమన్ హీరో తండ్రి పాత్రలో, సర్కార్ ప్రతినాయకుడిగా నటించారు. హాస్యనటులు చిత్రం శ్రీను, జబర్దస్త్ అప్పారావు కూడా కీలక పాత్రల్లో కనిపించనున్నారు. దర్శకుడు రమేష్ బాబు మాట్లాడుతూ.. తెలుగు సినిమాపై తనకు ఉన్న ప్రేమతో, మనసులోని సినిమా కలను నిజం చేసుకోవాలనే ఉద్దేశంతో ఈ చిత్రానికి దర్శకత్వం వహించానన్నారు. ప్రేక్షకుల ఆదరణతో మంచి దర్శకుడిగా గుర్తింపు తెచ్చుకోవాలని కోరుకుంటున్నానని తెలిపారు. సినిమా టీజర్‌కు మంచి స్పందన రావడం సంతోషంగా ఉందన్నారు.
27న 'సిద్ధుగాడి లవ్ స్టోరీ'
42 నిమిషాల క్రితం

వెబ్ డెస్క్
ప్రచురించబడింది నవం 23, 2026, 07:05 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం
ట్యాగ్లు
సంబంధిత వార్తలు






కామెంట్లు (0)