సోమవారం, 23 నవంబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

మ్యూజిక్ ఛానల్ ప్రారంభించిన పింక్ ఎలిఫెంట్

23 నిమిషాల క్రితం

మ్యూజిక్ ఛానల్ ప్రారంభించిన పింక్ ఎలిఫెంట్ image 1
వెబ్ డెస్క్

ప్రచురించబడింది నవం 23, 2026, 07:24 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం

జాతీయ అవార్డు అందుకున్న నిర్మాణ సంస్థ పింక్ ఎలిఫెంట్ తన క్రియేటివ్ ప్రయాణాన్ని విస్తరిస్తూ ప్రత్యేకంగా మ్యూజిక్ ఛానల్‌ను ప్రారంభించింది. వార్నర్ మ్యూజిక్ గ్రూప్‌కు చెందిన డివో మ్యూజిక్‌తో కలిసి ఈ ఛానల్ ద్వారా పాటలను విడుదల చేయనుంది. నిహారిక నిర్మిస్తున్న తెలుగు సినిమా 'పాకెట్ రాకెట్స్' ఆల్బమ్‌తో పింక్ ఎలిఫెంట్ మ్యూజిక్ తన ప్రయాణాన్ని ప్రారంభించనుంది. గ్యాని సంగీతం అందించిన ఈ ఆల్బమ్‌లోని పాటలు ఈ ఛానల్ ద్వారా ప్రేక్షకుల ముందుకు రానున్నాయి. పింక్ ఎలిఫెంట్ మ్యూజిక్ నుంచి విడుదల కానున్న తొలి మ్యూజికల్ ప్రాజెక్ట్ ఇదే. 2015లో ప్రారంభమైన పింక్ ఎలిఫెంట్ పిక్చర్స్ 'ముద్దపప్పు ఆవకాయ్', 'నాన్న కూచి', 'మ్యాడ్ హౌస్', 'ఒక చిన్న ఫ్యామిలీ స్టోరీ', 'హలో వరల్డ్', 'బెంచ్ లైఫ్' వంటి వెబ్ సిరీస్‌లు, డిజిటల్ ప్రాజెక్టులను నిర్మించింది. అనంతరం సినిమా నిర్మాణ రంగంలోకి అడుగుపెట్టి 'కమిటీ కుర్రోళ్లు' చిత్రాన్ని నిర్మించింది.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్