మంగళవారం, 10 నవంబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

గృహిణుల శ్రమకు తగిన గుర్తింపు లేదు

1 గంట క్రితం

గృహిణుల శ్రమకు తగిన గుర్తింపు లేదు: జెనీలియా image 1
వెబ్ డెస్క్

ప్రచురించబడింది నవం 10, 2026, 07:46 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం

ప్రముఖ నటి జెనీలియా ఎంత పనిచేస్తున్నా గృహిణులకు తగిన గుర్తింపు, గౌరవం లభించడం లేదని వ్యాఖ్యానించారు. తాజాగా ఆమె ఓ షోలో పాల్గొని చేసిన వ్యాఖ్యలు వైరల్ అయ్యాయి. 'మేనోపాజ్ దాటిన తర్వాత వయసు అయిపోయినట్లు కనిపిస్తారనే భయంతో చాలామంది ఈ విషయం గురించి మాట్లాడటానికి ఇష్టపడరు. అయితే వయసు పెరగడం అనేది ఒక అందమైన మార్పు. వయస్సుతో పాటు వచ్చే మార్పులను స్వీకరించాలి. నేను మళ్లీ 20 ఏళ్ల వయసులోకి వెళ్లాలని అనుకోవడం లేదు. 20ల కంటే ఇప్పుడు 40 ఏళ్ల వయసులోనే నేను మరింత కూల్‌గా, ఎంతో ధైర్యంగా ఉంటున్నాను. సమాజం ఎల్లప్పుడూ మహిళలు చిన్నవయస్కులుగా, గ్లామరస్‌గా కనిపించాలనే ఒత్తిడిని తెస్తుంది. కానీ మేనోపాజ్ వంటి ముఖ్యమైన ఆరోగ్య విషయాలను చర్చించకుండా దాటవేస్తుంది. అలాగే, గృహిణిగా ఉండటం అనేది ప్రపంచంలోనే అత్యంత కష్టమైన ఉద్యోగం. కానీ దానికి తగిన గుర్తింపు, గౌరవం లభించడం లేదని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు.


ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్