కృత్రిమ మేధస్సు, ఆధునిక సాంకేతికత మనిషి జీవితంపై చూపిస్తున్న ప్రభావం నేపథ్యంలో రూపొందుతున్న సైన్స్ ఫిక్షన్ సోషల్ థ్రిల్లర్ ‘లంబోదర 2.0’. ఆనందం అంటే ఏమిటి? డిజిటల్ బానిసత్వం నుంచి మనిషి ఎలా బయటపడాలి? అనే ప్రశ్నలను ఈ చిత్రం చర్చించనుంది. ఇందులో హ్యూమనాయిడ్ రోబోట్ కూడా ప్రత్యేక ఆకర్షణగా నిలవనుంది. అనీల్ శెట్టి స్వీయ రచన, నిర్మాణంలో రూపొందుతున్న ఈ చిత్రానికి సింపుల్ సుని దర్శకత్వం వహిస్తున్నారు. కునాల్ కపూర్, సాచి బింద్రా, మేఘనా గాంకర్, మాళవిక అవినాష్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. కన్నడ, హిందీ భాషల్లో తెరకెక్కిన ఈ చిత్రం నవంబరు 13న విడుదల కానుంది.








కామెంట్‌లు (0)