బుధవారం, 29 జులై 2026E-PAPER
మ్యాగజైన్స్

Print Editionరిషబ్ శెట్టికి 'లీడర్‌షిప్ ఇన్ సినిమా' అవార్డు

1 గంట క్రితం

Rishab Shetty
వెబ్ డెస్క్

ప్రచురించబడింది జులై 29, 2026, 08:55 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం

ప్రముఖ కన్నడ నటుడు రిషబ్ శెట్టికి అరుదైన గౌరవం దక్కింది. ఆస్ట్రేలియాలోని ‘ఇండియన్ ఫిల్మ్ ఫెస్టివల్ ఆఫ్ మెల్‌బోర్న్’ (ఐఎఫ్‌ఎఫ్‌ఎం)–2026లో ‘లీడర్‌షిప్ ఇన్ సినిమా’ అవార్డుకు ఆయన ఎంపికయ్యారు. ఆగస్టు 13న మెల్‌బోర్న్‌లో జరిగే వేడుకలో ఈ పురస్కారాన్ని అందుకోనున్నారు. భారతీయ సంస్కృతి, సంప్రదాయాలను ప్రతిబింబించే కథలను ప్రపంచానికి చాటిచెప్పినందుకు ఐఎఫ్‌ఎఫ్‌ఎం ఈ గౌరవాన్ని ప్రకటించింది. ఈ సందర్భంగా రిషబ్ శెట్టి మాట్లాడుతూ.. ‘మెల్‌బోర్న్ ఇండియన్ ఫిల్మ్ ఫెస్టివల్ నుంచి ‘లీడర్‌షిప్ ఇన్ సినిమా’ అవార్డును అందుకోవడం నాకు ఎంతో గౌరవంగా ఉంది. మన సంస్కృతిని, సంప్రదాయాలను, మనకు స్ఫూర్తినిచ్చే సమాజాలను గౌరవించడానికి నేను ఎల్లప్పుడూ ఎంచుకునే మార్గం కథే’ అని అన్నారు.


ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్