ప్రముఖ నటుడు ఆర్. మాధవన్ తన సోషల్ మీడియా పోస్టులో ఓ కలెక్టర్‌ను ప్రశంసించాడు. ఆ కలెక్టర్‌ను ఆయన ఎందుకు ప్రశంసించాడంటే.. ప్రతాప్ అనే ఐఏఎస్ అధికారి చేపట్టిన వినూత్న జల సంరక్షణ కార్యక్రమమే కారణం. ఈ కార్యక్రమం ద్వారా వేలాది మంది రైతులు, ప్రజలకు నీటి కొరత తీరింది. తిరువళ్లూర్ జిల్లా కలెక్టర్‌గా పనిచేసినప్పుడు ప్రతాప్, జిల్లాలో వేల సంఖ్యలో ఉన్న పాడుబడ్డ బోర్‌వెల్‌లను గమనించాడు. వర్షాకాలంలో భారీగా కురిసే వర్షపు నీరు కాలువలు, డ్రైనేజీల ద్వారా వృథాగా సముద్రంలో కలుస్తోందని గుర్తించాడు. ఆ నీటిని భూమిలోకి మళ్లించే ఆలోచనతో జిల్లాలో ఉన్న 1,200కుపైగా పాడుబడ్డ బోర్‌వెల్‌లను రీఛార్జ్ నిర్మాణాలుగా వినియోగించే ఏర్పాట్లు చేశారు. దీంతో జిల్లాలో భూగర్భ జలాల మట్టం గణనీయంగా పెరిగింది. బావులు, చేతి పంపుల్లో మళ్లీ నీరు అందుబాటులోకి రావడంతో రైతుల ముఖాల్లో ఆనందం వెల్లివిరిసింది. విరుదునగర్ జిల్లాలోని ఓ రైతు కుటుంబంలో పుట్టిన ప్రతాప్ మురుగన్‌కు నీటి విలువ బాగా తెలుసు. అందుకే కలెక్టర్ అయిన తర్వాత ఈ వినూత్న కార్యక్రమాన్ని అమలు చేశారు. దీనిపై మాధవన్ సోషల్ మీడియాలో ప్రశంసలు కురిపించడంతో ప్రతాప్‌కు దేశవ్యాప్తంగా గుర్తింపు లభిస్తోంది.
కలెక్టర్‌కు మాధవన్ ప్రశంసలు
30 జులై, 2026

వెబ్ డెస్క్
ప్రచురించబడింది జులై 30, 2026, 08:48 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం
ట్యాగ్‌లు
సంబంధిత వార్తలు






కామెంట్‌లు (0)