సోమవారం, 09 నవంబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

'మిషన్ సిద్ధం కౌంట్‌డౌన్ మొదలైంది` : ఓం ప్రమోషన్స్

50 నిమిషాల క్రితం

'మిషన్ సిద్ధం కౌంట్‌డౌన్ మొదలైంది` : ఓం ప్రమోషన్స్ image 1
వెబ్ డెస్క్

ప్రచురించబడింది నవం 09, 2026, 08:35 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం

కోలీవుడ్ నటుడు ధనుష్, మలయాళ అగ్రనటుడు మమ్ముట్టి నటిస్తోన్న తాజా చిత్రం 'ఓం: చాప్టర్ 1 – ఉధిరం: ది బ్లడ్ వుడ్`. ఈ చిత్రం నవంబర్ 20న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో చిత్ర యూనిట్ ప్రమోషన్స్ జోరు పెంచింది. తాజాగా ‘మిషన్ సిద్ధం.. కౌంట్‌డౌన్ మొదలైంది’ అంటూ మేకర్స్ ధనుష్, మమ్ముటిలు కలిసి ఉన్న కొత్త పోస్టర్ ను రిలీజ్ చేసింది. 'అమరన్` ఫేమ్ రాజ్‌కుమార్ పెరియసామి దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో నిత్యారెడ్డి అనే ఐపిఎస్ అధికారిణిగా సాయిపల్లవి నటిస్తోంది. ఎర్రచందనం స్మగ్లింగ్ నేపథ్యంలో సాగే ఈ మూవీలో శ్రీలీల రోజా పాత్రలో నటిస్తోంది. వుండర్‌బార్ ఫిల్మ్స్, ఆర్‌టేక్ స్టూడియోస్ బ్యానర్లపై ధనుష్, శ్రద్ధా అగర్వాల్, అజ్మత్ జగ్మాగ్ నిర్మిస్తున్నారు. సాయి అభ్యంకర్ సంగీతం అందిస్తున్నారు. ఇక ఈ మూవీని ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ విడుదల చేయనుంది.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్