ప్రముఖ దర్శకుడు మణిరత్నం మరో భారీ చిత్రానికి సిద్ధమవుతున్నట్లు సమాచారం. సూర్య, ధనుష్ కథానాయకులుగా ఓ పాన్ ఇండియా మల్టీస్టారర్‌ను తెరకెక్కించేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే కథకు సంబంధించిన పనులు పూర్తయ్యాయని, త్వరలోనే చిత్రాన్ని పట్టాలెక్కించనున్నారని ప్రచారం జరుగుతోంది. ప్రస్తుతం విజయ్ సేతుపతి, సాయిపల్లవి జంటగా ‘ఇంజి వెల్లమ్’ చిత్రాన్ని మణిరత్నం రూపొందిస్తున్నారు. ఈ సినిమా చిత్రీకరణ శరవేగంగా సాగుతోంది. వచ్చే ఏడాది జనవరిలో విడుదల చేయాలని భావిస్తున్నారు. ఈ ప్రాజెక్టు పూర్తయిన తర్వాత సూర్య, ధనుష్ చిత్రంపై దృష్టి పెట్టనున్నట్లు సినీ వర్గాల సమాచారం. అయితే ఈ మల్టీస్టారర్‌పై అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది.
Print Editionసూర్య, ధనుష్‌తో మణిరత్నం మల్టీస్టారర్?
6 రోజుల క్రితం

వెబ్ డెస్క్
ప్రచురించబడింది నవం 02, 2026, 09:10 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం
ట్యాగ్‌లు
సంబంధిత వార్తలు







కామెంట్‌లు (0)