ప్రముఖ గాయని ఎం.ఎస్. సుబ్బులక్ష్మి జీవిత కథలో నటించాలన్న తన కల నెరవేరకపోవడం ఇప్పటికీ బాధిస్తోందని బాలీవుడ్ నటి విద్యాబాలన్ అన్నారు. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో ఆమె మాట్లాడుతూ.. 2014లో దర్శకుడు రాజీవ్ మేనన్తో కలిసి సుబ్బులక్ష్మి బయోపిక్ తెరకెక్కించాలని నిర్ణయించుకున్నామని, ఆయన అద్భుతమైన కథను కూడా సిద్ధం చేశారని తెలిపారు. అయితే, కొన్ని కారణాలతో ఆ సినిమాపై స్టే ఆర్డర్ రావడంతో ప్రాజెక్టు ముందుకు సాగలేదని చెప్పారు. తమ ఇంట్లో ప్రతిరోజూ ఉదయం సుబ్బులక్ష్మి ఆలపించిన ‘వేంకటేశ్వర సుప్రభాతం’తోనే రోజు ప్రారంభమవుతుందని, ఆమె సంగీతమంటే తనకు ఎంతో ఇష్టమని విద్యాబాలన్ పేర్కొన్నారు. ఆమె జీవిత విశేషాలపై అవగాహన ఉన్నందున ఆ పాత్రలో నటించడం తన జీవితాశయమని, అది నెరవేరకపోవడం బాధ కలిగించిందని అన్నారు. సినిమా చేయలేకపోయినా రెండేళ్ల క్రితం ఆమెకు నివాళిగా ప్రత్యేక ఫొటోషూట్ నిర్వహించానని, ఆ చిత్రాలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అయ్యాయని తెలిపారు. ఇదిలా ఉండగా, ‘ఎం.ఎస్’ పేరుతో తెరకెక్కుతున్న సుబ్బులక్ష్మి బయోపిక్లో రష్మిక మందన్న ప్రధాన పాత్ర పోషిస్తున్నారు. గౌతమ్ తిన్ననూరి దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రానికి అనిరుధ్ రవిచందర్ సంగీతం అందిస్తున్నారు.
నా కల నెరవేరలేదు : విద్యా బాలన్
1 గంట క్రితం

వెబ్ డెస్క్
ప్రచురించబడింది అక్టో 16, 2026, 06:45 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం
ట్యాగ్లు
సంబంధిత వార్తలు






కామెంట్లు (0)