డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌తో సినిమా నిర్మించేందుకు సిద్ధమవుతున్నట్లు నిర్మాత దిల్ రాజు వెల్లడించారు. ‘రామాయణ’ సినిమా సక్సెస్ మీట్‌లో పాల్గొన్న ఆయన ఈ ప్రాజెక్టు గురించి ప్రస్తావించారు. సరైన సమయం చూసుకుని సినిమా వివరాలను అధికారికంగా ప్రకటిస్తామని తెలిపారు. ఈ నేపథ్యంలో పవన్ కల్యాణ్‌తో సినిమా నిర్మాణంపై చర్చలు తుది దశకు చేరుకున్నట్లు వార్తలు వస్తున్నాయి. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్‌పై రూపొందనున్న ఈ చిత్రానికి వంశీ పైడిపల్లి లేదా అనిల్ రావిపూడి దర్శకత్వం వహించే అవకాశాలున్నట్లు ప్రచారం జరుగుతోంది. అయితే దర్శకుడితో పాటు ఇతర వివరాలపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.
మళ్లీ పవన్ కల్యాణ్ - దిల్ రాజు కాంబినేషన్
10 గంటల క్రితం

వెబ్ డెస్క్
ప్రచురించబడింది నవం 13, 2026, 07:00 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం
ట్యాగ్‌లు
సంబంధిత వార్తలు







కామెంట్‌లు (0)