కులవివక్ష, సామాజిక అసమానతలు, మహిళలపై వివక్షకు వ్యతిరేకంగా పోరాడిన జ్యోతిరావ్ ఫూలే, సావిత్రిబాయి ఫూలే జీవితాల ఆధారంగా తెరకెక్కిన చిత్రం ‘ఫూలే’. అనంత్ మహదేవన్ దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమా నవంబర్ 27న విడుదల కానుంది. తాజాగా తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి, మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో కలిసి ఈ సినిమా ప్రత్యేక ప్రదర్శనను వీక్షించారు. అనంతరం ఫూలే దంపతులు కులవివక్ష నిర్మూలన, మహిళా విద్య కోసం చేసిన పోరాటం నేటి తరానికి గొప్ప స్ఫూర్తిదాయకమని ఉప ముఖ్యమంత్రి కొనియాడారు. సమానత్వం, విద్య, మానవత్వం, సామాజిక బాధ్యత వంటి విలువలను చాటిచెప్పే ఈ చిత్రాన్ని యువత, విద్యార్థులు తప్పక చూడాలని చిత్రబృందం కోరింది. డా. పొన్నం రవిచంద్ర ఈ చిత్రాన్ని నిర్మించారు.
ఫూలే పోరాటం స్ఫూర్తిదాయకం
7 గంటల క్రితం

వెబ్ డెస్క్
ప్రచురించబడింది నవం 21, 2026, 07:00 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం
ట్యాగ్‌లు
సంబంధిత వార్తలు







కామెంట్‌లు (0)