సోమవారం, 06 జులై 2026E-PAPER
మ్యాగజైన్స్

రచయితగా నిర్మాతగా ప్రదీప్‌ రంగనాథ్‌..

1 గంట క్రితం

post
వెబ్ డెస్క్

ప్రచురించబడింది జులై 06, 2026, 08:27 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం

తమిళ నటుడు ప్రదీప్‌ రంగనాథన్‌ స్వయంగా కథ రాసి ఓ సినిమా నిర్మించనున్నారు. తన దగ్గర పనిచేసిన ఆరుగురు కుర్రాళ్లను ‘ద ఆల్ఫా టీమ్‌’ పేరు పెట్టి దీనికి దర్శకత్వం వహించే బాధ్యతను అప్పగించారు. ‘పిఆర్‌ షో’ వర్కింగ్‌ టైటిల్‌తో రానున్న ఈ చిత్రంలో మమిత బైజు, అశ్వత్‌ మారిముత్తు కీలక పాత్రధారులు. తెలుగు నటుడు శివాజీతోపాటు శ్వాసిక, అనామిక మహి కీలక పాత్ర పోషించనున్నారు. సాయి అభ్యంకర్‌ సంగీతం అందిస్తున్నారు. తెలుగు, తమిళ, మలయాళ భాషల్లో ఈ చిత్రం విడుదల కానున్నట్లు తెలిపారు. దీనికి సంబంధించిన లాంచ్‌ వీడియోను ప్రదీప్‌ సోమవారం విడుదల చేశారు. ‘మొదటిసారి రాసింది.. తీసేది నేను కాదు. ఆరుగురు యువత ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. వారిని ‘ఆల్ఫా’ యూనిట్‌ అని పిలుస్తాం’ అని వీడియోలో వెల్లడించారు.


ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్