శుక్రవారం, 16 అక్టోబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

పృథ్వీరాజ్‌కు రాజమౌళి శుభాకాంక్షలు

3 గంటల క్రితం

పృథ్వీరాజ్‌కు రాజమౌళి శుభాకాంక్షలు image 1
వెబ్ డెస్క్

ప్రచురించబడింది అక్టో 16, 2026, 06:36 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం

రాజమౌళి దర్శకత్వంలో మహేష్‌బాబు కథానాయకుడిగా నటిస్తున్న చిత్రం ‘వారణాసి’. ఇందులో ప్రియాంక చోప్రా, పృథ్వీరాజ్‌ సుకుమారన్‌ కీలక పాత్రలు పోషిస్తున్నారు. శుక్రవారం పృథ్వీరాజ్‌ పుట్టినరోజు సందర్భంగా రాజమౌళి సామాజిక మాధ్యమాల్లో ప్రత్యేకంగా శుభాకాంక్షలు తెలిపారు. ‘‘హ్యాపీ బర్త్‌డే పృథ్వీ. ఈరోజు నీలోని ‘కుంభ’ను తట్టిలేపాలని అనుకోవడం లేదు. ప్రపంచంపై తనదైన ముద్ర వేయాలని విధి నిర్ణయించిన వ్యక్తి కుంభ’’ అంటూ సరదాగా వ్యాఖ్యానించారు. ఈ చిత్రంలో పృథ్వీరాజ్‌ పోషిస్తున్న పాత్ర పేరు ‘కుంభ’. రాజమౌళి చేసిన ఈ పోస్టు సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది. ఈ చిత్రాన్ని వచ్చే ఏడాది ఏప్రిల్‌ 7న ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయనున్నారు.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్