మంగళవారం, 21 జులై 2026E-PAPER
మ్యాగజైన్స్

రికార్డు స్థాయిలో అడ్వాన్స్‌ బుకింగ్స్‌..

2 గంటల క్రితం

aveger
వెబ్ డెస్క్

ప్రచురించబడింది జులై 21, 2026, 09:08 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం

మార్వెల్ సినిమాటిక్ యూనివర్స్ నుంచి వస్తున్న తాజా చిత్రం 'అవెంజర్స్: డూమ్స్‌డే'. డిసెంబర్ 18న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలోకి రానున్న ఈ చిత్రానికి అడ్వాన్స్ బుకింగ్స్ తాజాగా ప్రారంభమయ్యాయి. ట్రైలర్ విడుదలైన వెంటనే చిత్రబృందం అడ్వాన్స్ సేల్స్ ప్రారంభించింది. కేవలం 12 గంటల్లోనే రూ. 87 కోట్ల విలువైన టికెట్లు అమ్ముడయ్యాయి. ఇక్కడ విచిత్రమేమిటంటే.. డిస్నీ కొత్తగా తీసుకొచ్చిన 'ఇన్ఫినిటీ విజన్' అనే ప్రీమియం లార్జ్-స్క్రీన్ ఫార్మాట్‌లో మాత్రమే ప్రస్తుతం టికెట్లను అందుబాటులో ఉంచారు. అమెరికాలోని మొత్తం స్క్రీన్లలో 10 శాతం థియేటర్లలోనే బుకింగ్స్ మొదలయ్యాయి. ఈ సినిమాలో రాబర్ట్ డౌనీ జూనియర్ గ్రాండ్ రీ-ఎంట్రీ ఇస్తున్నారు. దశాబ్దానికి పైగా 'ఐరన్ మ్యాన్'గా ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మంది అభిమానులను సంపాదించుకున్న ఆయన, ఈసారి ఐకానిక్ విలన్ 'డాక్టర్ డూమ్' అవతారంలో మెప్పించనున్నారు.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్