బాలీవుడ్ నటుడు అమితాబ్ బచ్చన్ తన ఆరోగ్యానికి సంబంధించిన కీలక విషయాన్ని తాజాగా అభిమానులతో పంచుకున్నారు. ఇటీవల ఆసుపత్రిలో చేరి శస్త్రచికిత్స చేయించుకున్నట్లు ఆయన తన వ్యక్తిగత బ్లాగ్‌లో వెల్లడించారు. ప్రస్తుతం ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయి ఇంటికి చేరుకున్నప్పటికీ, కోలుకునే ప్రక్రియ శారీరకంగానే కాకుండా మానసికంగా కూడా ఎంతో కష్టంగా ఉందని ఆయన పేర్కొన్నారు. ‘ఆసుపత్రిలో అత్యుత్తమ వైద్యులు, వైద్య సిబ్బంది పర్యవేక్షణలో శస్త్రచికిత్స, ఐసీయూలో చికిత్స, ఆ తర్వాత డిశ్చార్జ్ అయి ఇంటికి తిరిగి రావడం జరిగింది. శారీరకంగా, మానసికంగా కోలుకునే ఈ దశ అత్యంత కష్టతరమైనది’ అని పేర్కొన్నారు. అయితే, ఏ కారణంతో శస్త్రచికిత్స జరిగింది? ఏ చికిత్స చేయించుకున్నారు? అనే విషయాలను మాత్రం వెల్లడించలేదు. ఆరోగ్య పరిస్థితి గురించి మాత్రమే కాకుండా, జీవితంలో ఎదురయ్యే విజయాలు, అపజయాలపై కూడా అమితాబ్ తన ఆలోచనలను అభిమానులతో పంచుకున్నారు. ఒక రోజు ప్రతి విజేత కూడా ఓటమిని ఎదుర్కోవాల్సి వస్తుందని, అలాంటి సమయంలో ధైర్యంగా ముందుకు సాగే వారే నిజమైన ఛాంపియన్లు అవుతారని పేర్కొన్నారు. గత విజయాల జ్ఞాపకాలకే పరిమితమైపోకుండా, కొత్త సవాళ్లను స్వీకరించాలని సూచించారు.
Print Editionకోలుకునే దశ అత్యంత కష్టమైనది!
2 గంటల క్రితం

వెబ్ డెస్క్
ప్రచురించబడింది జులై 21, 2026, 09:13 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం
ట్యాగ్‌లు
సంబంధిత వార్తలు







కామెంట్‌లు (0)