ప్రముఖ బాలీవుడ్ నటుడు నసీరుద్దీన్ షా త్వరలో రంగస్థలంపై సాల్మన్ రష్దీ పాత్రలో కనిపించనున్నారు. రష్దీ రాసిన ‘నైఫ్’ పుస్తకం ఆధారంగా రూపొందుతున్న ‘27 సెంకడ్స్’ నాటకంలో ఆయన నటించనున్నారు. సాల్మన్ రష్దీ 2024లో రాసిన 'నైఫ్ : మెడిటేషన్స్, ఆఫ్టర్ యాన్ అటెంప్ట్‌డ్ మర్డర్' ఆధారంగా ఈ నాటకం రూపుదిద్దుకుంటోంది. 2022 ఆగస్ట్ 12న న్యూయార్క్ లో సాల్మన్ రష్దీపై హత్యాయత్నం జరిగింది. ఆ కత్తిదాడిలో ఆయన తన కుడి కంటి చూపును కోల్పోయారు. ఈ అనుభవాల ఆధారంగా రాసిన పుస్తకంలోని సన్నివేశాలనే ఇప్పుడు స్టేజ్ ప్లేగా చూపబోతున్నారు. ఈ నాటకానికి నసీరుద్దీన్ షాతో పాటు అర్ఘ్య లాహిరి దర్శకత్వం వహిస్తారు. మలౌకా చౌదరి, రష్దీ భార్య రాచెల్ ఎలిజా గ్రిఫిత్స్ ఇందులో నటించబోతున్నారు.
రంగస్థలంపై సాల్మన్ రష్దీగా!
2 గంటల క్రితం

వెబ్ డెస్క్
ప్రచురించబడింది అక్టో 12, 2026, 05:25 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం
ట్యాగ్‌లు
సంబంధిత వార్తలు







కామెంట్‌లు (0)