‘జైలర్ 2’ ప్రచార కార్యక్రమంలో భాగంగా బెంగళూరులో బస్సు కండక్టర్‌గా చేసినప్పటి రోజులను రజినీకాంత్ గుర్తు చేసుకున్నారు. ప్రస్తుతం నటుడిగా అగ్రస్థాయిలో ఉన్నప్పటికీ, కండక్టర్‌గా పనిచేసినప్పుడే ఎక్కువ సంతోషంగా ఉండేవాడినని తెలిపారు. చిత్ర దర్శకుడు నెల్సన్ దిలీప్‌కుమార్ రజనీకాంత్‌లోని వినయం గురించి ఆ కార్యక్రమంలో ప్రస్తావించారు. దీనికి రజనీ స్పందిస్తూ ‘నేను స్టార్‌ను అయినప్పటికీ, నాకు నటనంటే ఇష్టం. అయితే అంతకంటే బస్సు కండక్టర్‌గా పనిచేయడమే ఇంకా ఇష్టం. నేను అయిదేళ్ల పాటు కండక్టర్‌గా పనిచేశాను. ఇప్పటికీ ఆ ఉద్యోగాన్ని మిస్ అవుతుంటాను. నేను తరచూ బెంగళూరు వెళ్లేది కూడా అందుకే. నన్ను నేను ఎప్పుడూ ఓ స్టార్‌గా భావించలేదు. ఇప్పటికీ బస్సు కండక్టర్‌గానే భావిస్తుంటాను. అలాంటప్పుడు, నాలాంటి ఓ బస్సు కండక్టర్ మీలాంటి పెద్ద వ్యక్తి ముందు ఎలా ప్రవర్తిస్తారు చెప్పండి?’ అని రజనీకాంత్ అన్నారు. ‘జైలర్’కు సీక్వెల్‌గా తెరకెక్కిన ‘జైలర్ 2’ అక్టోబరు15న విడుదల కానుంది.
నాలాంటి బస్ కండక్టర్..
2 గంటల క్రితం

వెబ్ డెస్క్
ప్రచురించబడింది అక్టో 12, 2026, 06:45 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం
ట్యాగ్‌లు
సంబంధిత వార్తలు







కామెంట్‌లు (0)