బుధవారం, 21 అక్టోబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

బుజ్జి కారును ధ్వంసం చేసే సన్నివేశాలు!

7 గంటల క్రితం

బుజ్జి కారును ధ్వంసం చేసే సన్నివేశాలు! image 1
వెబ్ డెస్క్

ప్రచురించబడింది అక్టో 21, 2026, 06:44 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం

ప్రభాస్‌ నటించిన ‘కల్కి 2898 ఏడీ’కి సీక్వెల్‌గా తెరకెక్కుతున్న ‘కల్కి 2’ చిత్రీకరణ హైదరాబాద్‌ శివార్లలో జరిగింది. దసరా రోజున ప్రభాస్‌ షూటింగ్‌లో పాల్గొన్నారు. ఈ షెడ్యూల్‌లో బుజ్జి కారును కమల్‌ హాసన్‌ బృందం ధ్వంసం చేసే సన్నివేశాలను చిత్రీకరించినట్లు సమాచారం. అక్టోబర్‌లో ప్రభాస్‌, సాయిపల్లవిపై కొన్ని సన్నివేశాలను చిత్రీకరించారు. తాజా షెడ్యూల్‌ పూర్తికాగా, నవంబర్‌లో మరో షెడ్యూల్‌ ప్రారంభం కానుంది. ఇందులో దుల్కర్‌ సల్మాన్‌పై కీలక సన్నివేశాలను తెరకెక్కించనున్నట్లు తెలుస్తోంది. నాగ్‌ అశ్విన్‌ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రంలో కమల్‌ హాసన్‌, అమితాబ్‌ బచ్చన్‌, దుల్కర్‌ సల్మాన్‌ కీలక పాత్రలు పోషిస్తున్నారు. ప్రముఖ నటీనటుల కలయికతో ఈ సీక్వెల్‌పై భారీ అంచనాలు నెలకొన్నాయి.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్