సోమవారం, 19 అక్టోబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

టైగర్‌ ష్రాఫ్‌ కారుపై కాల్పులు..

1 గంట క్రితం

gun fire.webp
వెబ్ డెస్క్

ప్రచురించబడింది అక్టో 19, 2026, 06:53 పూర్వాహ్నం | 1 నిమిషాల చదవడం

  • ఐదు రౌండ్లకు పైగా కాల్పులు జరిపిన దుండగులు

ముంబై: బాలీవుడ్‌ యాక్షన్‌ హీరో టైగర్‌ ష్రాఫ్‌ను లక్ష్యంగా చేసుకుని దుండగులు కాల్పులకు తెగబడ్డారు. ఆదివారం రాత్రి 7.30 గంటల సమయంలో ముంబైలోని జుహు ప్రాంతంలో టైగర్‌ ష్రాఫ్‌ కారులో ప్రయాణిస్తున్నప్పుడు ఈ ఘటన చోటుచేసుకుంది. మోటార్‌సైకిల్‌పై వచ్చిన ముగ్గురు దుండగులు ఆయన కారుపై ఐదు రౌండ్లకు పైగా కాల్పులు జరిపినట్లు పోలీసులు తెలిపారు. ఘటనలో టైగర్‌ ష్రాఫ్‌, ఆయన కారు డ్రైవర్‌తో పాటు మరో ఆటోరిక్షా డ్రైవర్‌ స్వల్పంగా గాయపడినట్లు తెలిపారు.

ఈ ఘటనపై జుహు పోలీస్‌ స్టేషన్‌లో కేసు నమోదైంది. అప్రమత్తమైన ముంబై పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. ఘటనా స్థలంలోని సీసీటీవీ దృశ్యాలను పరిశీలిస్తూ నిందితుల ఆచూకీ కోసం గాలిస్తున్నారు. ప్రముఖ బాలీవుడ్‌ నటుడు జాకీ ష్రాఫ్‌ కుమారుడైన టైగర్‌ ష్రాఫ్‌పై కాల్పుల ఘటన ముంబైలో కలకలం రేపింది.

ఈ దాడికి తామే బాధ్యులమంటూ గ్యాంగ్‌స్టర్‌ లారెన్స్‌ బిష్ణోయ్‌ గ్యాంగ్‌ ప్రకటించినట్లు వార్తలు వెలువడ్డాయి. గ్యాంగ్‌స్టర్‌ అనిల్‌ పండిట్‌ సోషల్‌ మీడియాలో ఈ మేరకు పోస్ట్‌ పెట్టినట్లు సమాచారం. అయితే, ఈ ప్రకటనకు సంబంధించిన వివరాలను అధికారికంగా ధ్రువీకరించాల్సి ఉంది. కాల్పుల ఘటనకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది.

ఈ ఘటన నేపథ్యంలో మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి ఏక్‌నాథ్‌ షిండే ఆదివారం రాత్రి టైగర్‌ ష్రాఫ్‌ నివాసానికి వెళ్లి ఆయనను, కుటుంబ సభ్యులను పరామర్శించారు. ప్రజా ప్రముఖులను బెదిరించే చర్యలను ప్రభుత్వం సహించబోదని స్పష్టం చేశారు. టైగర్‌ ష్రాఫ్‌, ఆయన తల్లి ఆయేషా ష్రాఫ్‌ తీవ్ర ఆందోళనకు గురయ్యారని, వారికి రాష్ట్ర ప్రభుత్వం అండగా ఉంటుందని హామీ ఇచ్చారు.



ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్