చెన్నై:తమిళనాడులో భారీ వర్షాలు జనజీవనాన్ని అస్తవ్యస్తం చేస్తున్నాయి.రాజధాని చెన్నైలో కురుస్తున్న కుండపోత వర్షాలతో నగరం జలమయమైంది.లోతట్టు ప్రాంతాలు నీటమునగడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.పరిస్థితుల నేపథ్యంలో వాతావరణ శాఖ చెన్నైకి రెడ్ అలర్ట్ జారీ చేయగా,పలు జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ ప్రకటించింది.
చెన్నైతో పాటు చెంగల్పట్టు,తిరువళ్లూరు,నీలగిరి,కోయంబత్తూరు,తేని జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది.మరో26జిల్లాల్లోనూ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని అంచనా వేసింది.
శనివారం కురిసిన వర్షాలకు చెన్నై మహానగరంతో పాటు శివారు ప్రాంతాలు జలమయమయ్యాయి.లోతట్టు ప్రాంతాల్లోని ఇళ్లలోకి వరద నీరు చేరింది.రహదారులపై నీరు నిలిచిపోవడంతో రాకపోకలకు ఇబ్బందులు ఎదురయ్యాయి.వరద నీటిని తొలగించేందుకు అధికారులు స్టార్మ్ వాటర్ డ్రెయిన్లు,మోటార్ పంపుల ద్వారా చర్యలు చేపట్టారు.
అక్టోబరు15న ప్రారంభమైన ఈశాన్య రుతుపవనాల ప్రభావంతో భారీ వర్షాలు కురుస్తున్నాయని వాతావరణ నిపుణులు తెలిపారు.మరోవైపు,వర్షాల నేపథ్యంలో పాఠశాలలకు సెలవులపై విద్యార్థులు,తల్లిదండ్రుల్లో సందిగ్ధత నెలకొంది.వాతావరణ శాఖ నివేదికల ఆధారంగా పరిస్థితిని సమీక్షించి తగిన సమయంలో నిర్ణయం తీసుకుంటామని తమిళనాడు విద్యాశాఖ మంత్రి రాజ్మోహన్ వెల్లడించారు.






కామెంట్లు (0)