సోమవారం, 19 అక్టోబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

Print Editionనేడు మోస్తరు వర్షాలు...

2 గంటల క్రితం

Rains in AP over the next 3 days.
వెబ్ డెస్క్

ప్రచురించబడింది అక్టో 19, 2026, 06:45 పూర్వాహ్నం | 1 నిమిషాల చదవడం

  • భారత వాతావరణ సంస్థ

ప్రజాశక్తి-అమరావతి బ్యూరో : పశ్చిమ మధ్య బంగాళాఖాతం, దానిని ఆనుకుని ఉన్న దక్షిణ ఆంధ్రప్రదేశ్‌, తమిళనాడు తీర ప్రాంతాల వద్ద ఉపరితల ఆవర్తనం కొనసాగుతోందని అమరావతిలోని భారత వాతావరణ కేంద్రం వెల్లడించింది. మరోవైపు లక్షద్వీప్‌ నుంచి కర్ణాటక, దక్షిణ ఆంధ్రప్రదేశ్‌ మీదుగా పశ్చిమ మధ్య బంగాళాఖాతం వరకు ద్రోణి విస్తరించి ఉందని ఆదివారం ఒక ప్రకటనలో పేర్కొంది. కోస్తాంధ్ర, యానాం, రాయలసీమల్లో పలుచోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు పడే అవకాశం ఉందని, ఒకట్రెండు చోట్ల భారీ వర్షాలు పడే అవకాశముందని తెలిపింది. అలాగే అక్కడక్కడ ఉరుములతో కూడిన మెరుపులు సంభవించవచ్చని హెచ్చరించింది. గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో, గరిష్టంగా గంటకు 60 కిలోమీటర్ల వేగంతో బలమైన గాలులు వీచే అవకాశం ఉందని పేర్కొంది.

​

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్