బుధవారం, 22 జులై 2026E-PAPER
మ్యాగజైన్స్

Print Editionకొందరు నన్ను కావాలని తప్పించారు : ప్రియాంక

5 గంటల క్రితం

priyanka-chopra
వెబ్ డెస్క్

ప్రచురించబడింది జులై 22, 2026, 09:08 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం

ప్రముఖ బాలీవుడ్ నటి ప్రియాంక చోప్రా తాను హీరోయిన్‌గా ఎదుగుతున్న క్రమంలో ఎన్నో ఒడుదొడుకులను ఎదుర్కొన్నానని చెప్పారు. కొంతమంది అగ్రహీరోలు తనను కావాలనే వాళ్ల సినిమాల నుంచి తప్పించారని తాజాగా ఆమె ఓ ఇంటర్వ్యూలో తెలిపారు. 'నేను కొందరిని మెప్పించలేదు. వారు చెప్పినట్లు చేయలేదు. నాకు దక్కే అవకాశాల కోసం నేను వారితో రాజీపడడం నాకిష్టం లేదు. దీంతో కొందరు అగ్రహీరోలు నన్ను వాళ్ల సినిమాల నుంచి ఉద్దేశపూర్వకంగా తప్పించారు. 2007లో ‘సలామ్-ఎ-ఇష్క్’ షూటింగ్ సమయంలో నేను మరో సినిమాలో నటించాల్సి వచ్చింది. ఒకరోజు ఆ చిత్ర హీరో నా సెట్‌కు వచ్చారు. ఆ సమయంలో ఆయన తరువాత నెలలో జరిగే మా సినిమా షూటింగ్‌కు సంబంధించి నాతో మాట్లాడడానికి వచ్చారనుకున్నా. కానీ ఆయన నాకు షాకింగ్ విషయం చెప్పారు. ‘ఈ సినిమాకు హీరోయిన్‌గా దర్శకుడు మిమ్మల్ని పొరపాటున ఎంపిక చేశారు. నిజానికి ఆ పాత్ర వేరే హీరోయిన్ చేయాల్సింది. మనం భవిష్యత్తులో మరో సినిమా చేద్దాం. ఈ విషయం నీకు స్వయంగా కలిసి చెబుదామనే ఇక్కడికి వచ్చాను’ అని చెప్పారు. ఇలాంటివి నా జీవితంలో చాలా చూశాను. ఆ పరిస్థితుల్లో నేను నా కెరీర్ గురించి, నటనపైనే మాత్రమే దృష్టి పెట్టాలని నిర్ణయించుకున్నాను. నా కష్టమే నా కెరీర్‌ను నిలబెట్టి, మరిన్ని అవకాశాలు తెచ్చిపెట్టింది’ అని ప్రియాంక చెప్పారు.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్