సుహాస్ హీరోగా ఓ చిత్రం చేస్తున్నారు. ఈ సినిమాకు ‘హైడ్ & సిల్క్’ అనే విభిన్నమైన టైటిల్‌ను ఖరారు చేశారు. సోమవారం ఈ చిత్ర నుండి ఫస్ట్ లుక్ పోస్టర్ ను, గ్లింప్స్ వీడియోను విడుదల చేశారు. ఈ వీడియోలో సుహాస్ మగ్గంపై చీర నేస్తూ కనిపిస్తున్నారు. ఈ వీడియోకి సీనియర్ నటుడు తనికెళ్ల భరణి వాయిస్ ఓవర్ ఇచ్చారు. ‘ప్రతి చీర ఒక ప్రత్యేకమైన మహిళ కోసమే పుడుతుంది’ అనే డైలాగ్ వీడియోలో వినిపిస్తోంది. ఈ చిత్రంలో హీరోయిన్‌గా సంజన నటిస్తున్నారు. ప్రముఖ నిర్మాణ సంస్థ ‘స్టోన్ బెంచ్ స్టూడియోస్’ మొదటి ప్రాజెక్ట్‌గా ఈ చిత్రం రాబోతోంది. వర్తికా జైన్‌కు చెందిన ‘మిశ్రిలాల్ పిక్చర్స్’తో కలిసి ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఈ చిత్రంతో రాజేంద్ర బాల దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. తెలుగు, తమిళంలో త్వరలోనే ఈ చిత్రం విడుదల కాబోతున్నట్లు చిత్రబృందం స్పష్టం చేశారు.
సుహాస్ హీరోగా ‘హైడ్ & సిల్క్’
2 గంటల క్రితం

వెబ్ డెస్క్
ప్రచురించబడింది అక్టో 12, 2026, 05:26 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం
ట్యాగ్‌లు
సంబంధిత వార్తలు







కామెంట్‌లు (0)