అక్కినేని నాగార్జున వందో చిత్రం ‘కింగ్ 100’లో నటి టబు కీలక పాత్ర పోషిస్తున్నారు. దసరా సందర్భంగా ఆమె పాత్రకు సంబంధించిన కొత్త పోస్టర్‌ను చిత్రబృందం విడుదల చేసింది. ఇందులో టబు ముఖం నీడలో కనిపిస్తూ ఆసక్తి రేకెత్తిస్తోంది. ‘ఆమె అడుగుపెడుతుంది.. అతని ప్రపంచం కుప్పకూలుతుంది. ‘కింగ్ 100’ ప్రపంచంలోకి అత్యంత హుందాతనంతో టబును పరిచయం చేస్తున్నాం’ అంటూ మేకర్స్ పోస్టర్‌కు క్యాప్షన్ జోడించారు. అన్నపూర్ణ స్టూడియోస్, మనం ఎంటర్‌ప్రైజెస్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రంలో ఐశ్వర్య రాజేశ్, సుస్మితా భట్, అశోక్ సెల్వన్, రవీంద్ర విజయ్ తదితరులు నటిస్తున్నారు. ఈ ఏడాది క్రిస్మస్ సందర్భంగా సినిమాను విడుదల చేయాలని చిత్రబృందం భావిస్తోంది.
‘కింగ్ 100’లో టబు.. పోస్టర్ విడుదల
1 గంట క్రితం

వెబ్ డెస్క్
ప్రచురించబడింది అక్టో 19, 2026, 08:15 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం
ట్యాగ్‌లు
సంబంధిత వార్తలు






కామెంట్‌లు (0)