- అధికార లాంఛనాలతో అంత్యక్రియలు
మైసూర్ : ప్రముఖ నేపథ్య గాయని, గానకోకిల ఎస్ జానకి అంత్యక్రియలు కర్టాటకలోని హెచ్‌డి కోట తాలూకాలోని కణియన హుండీలో ఆదివారం నాడు ప్రభుత్వ లాంఛనాలతో జరిగాయి. జానకి మనవరాలు అప్సర విద్యుల, కోడలు ఉమ అంత్యక్రియలు నిర్వహించారు. సాయుధ రిజర్వ్ పోలీసు సిబ్బంది గాల్లోకి మూడు రౌండ్లు కాల్పులు జరిపిన అనంతరం ఆమె మనవరాలు అప్సర సాయంత్రం 5:36 గంటలకు చితికి నిప్పంటించారు. దీంతో, సంగీత ప్రపంచం నుంచి ఒక అద్వితీయమైన స్వర ప్రస్థానం ముగిసింది. తమ అభిమాన గాయని అంత్యక్రియలకు వేలాది మంది అభిమానులు తరలివచ్చారు. ‘జానకమ్మ అమరత్వం పొందాలి’ అని నినాదాలు చేశారు. అంతకుముందు జానకమ్మ పార్థివవదేహాన్ని మహారాజా మైదాన్ నుంచి కణియన హుండీకి తీసుకెళ్లే రహదారి వెంబడి అభిమానులు భారీ సంఖ్యలో గుమిగూడారు. పూలతో అలంకరించిన వాహనం ముందుకు కదులుతుండగా, దారి పక్కన నిలబడిన మహిళలు కన్నీరు పెట్టుకున్నారు. ఆంధ్రప్రదేశ్‌లో జన్మించి, తన గాత్రంతో దేశవ్యాప్తంగా పేరు సంపాదించుకున్న ఎస్ జానకికి మైసూరు ప్రజలు కన్నీటి వీడ్కోలు పలికి, నివాళులర్పించారు. జిల్లా పోలీస్‌శాఖ అంత్యక్రియల స్థలం వద్ద, రహదారి పొడవునా కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేసింది.








కామెంట్‌లు (0)