శనివారం, 21 నవంబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

పాటకు భావం ముఖ్యం : చంద్రబోస్

7 గంటల క్రితం

పాటకు భావం ముఖ్యం : చంద్రబోస్ image 1
వెబ్ డెస్క్

ప్రచురించబడింది నవం 21, 2026, 06:55 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం

శర్వానంద్‌, అనుపమ పరమేశ్వరన్‌, డింపుల్‌ హయాతి ప్రధాన పాత్రల్లో నటిస్తున్న చిత్రం ‘భోగి’. పీరియడ్‌ యాక్షన్‌ డ్రామాగా రూపొందిన ఈ సినిమా నవంబర్‌ 27న విడుదల కానుంది. ఈ చిత్రంలోని పాటలన్నీ రాసిన చంద్రబోస్‌ తాజాగా మీడియాతో మాట్లాడారు. ‘మల్లేశం’, ‘ఛాంపియన్‌’ సినిమాల్లో తెలంగాణ మాండలికంలో పాటలు రాసినప్పటికీ, ‘భోగి’లో అత్యంత సహజమైన తెలంగాణ భాషను ఉపయోగించానని చెప్పారు. చిన్నప్పుడు విన్న, మాట్లాడుకున్న, పరిశీలించిన మాటలను పాటల్లో రాసే అవకాశం రావడం ఆనందంగా ఉందన్నారు. తెలంగాణ పల్లెటూరి జీవనాన్ని ప్రతిబింబించే ఈ సినిమాలో ‘ఎగిలివారంగ’ పాటకు విశేష స్పందన వస్తోందని తెలిపారు. ఆ రోజుల్లో ప్రజల జీవన విధానం, వారు ఎవరి పాలనలో ఉండేవారు, ఎదుర్కొన్న పరిస్థితులను పాటలో వివరించడంతో ప్రేక్షకులు తమ ఊరి జీవితాన్ని గుర్తుచేసుకుంటున్నారని చెప్పారు. ఈ చిత్రంలో ఐదు పాటలున్నాయని, రెండు బిట్‌ సాంగ్స్‌, మూడు పూర్తి పాటలన్నీ కథలోని సందర్భాలకు అనుగుణంగా రూపొందించామని వెల్లడించారు. పాటకు భావం ముఖ్యమని, ఆ భావం ప్రజల భాషలో ఉండాలని, ప్రజల్లో చైతన్యం తీసుకురావాలంటే వారి భాషను మాట్లాడాలని అన్నారు. ‘భోగి’ మంచి భావోద్వేగాలతో కూడిన కథ అని, కథ, స్క్రీన్‌ప్లే, సంగీతం, కెమెరా, రచన తదితర విభాగాలకు గుర్తింపు తీసుకొచ్చే చిత్రమవుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్