మహిళలపై జరుగుతున్న నేరాల నేపథ్యంలో ‘గరుడ వేగ’ ఫేమ్ దర్శకుడు అంజి తెరకెక్కిస్తున్న చిత్రం ‘అన్‌ఎక్స్‌పెక్టెడ్ – సఫేద్ సచ్’. 2024లో ఉత్తరాఖండ్ నుంచి రాత్రిపూట బస్సులో డెహ్రాడూన్ చేరుకున్న ఓ టీనేజ్ అమ్మాయి అదృశ్యమై, పాడుబడిన బస్సులో కనిపించిన ఘటన ఆధారంగా ఈ ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్ రూపొందుతోంది. ఈ ఘటన వెనుక ఉన్న నిజాలను వెలికితీసే కథాంశంతో సినిమా తెరకెక్కుతోంది. పృథ్వీరాజ్, తంబి రామయ్య, సంజయ్ సింగ్, గంజా కరుప్పు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. తాజాగా చిత్రబృందం విడుదల చేసిన ఫస్ట్‌లుక్ పోస్టర్‌లో సంజయ్ కపూర్ సిక్కు పోలీస్ అధికారిగా కనిపిస్తున్నారు. ఈ చిత్రం వచ్చే ఏడాది ప్రేక్షకుల ముందుకు రానుంది.
‘అన్‌ఎక్స్‌పెక్టెడ్ – సఫేద్ సచ్’ ఫస్ట్‌లుక్
41 నిమిషాల క్రితం

వెబ్ డెస్క్
ప్రచురించబడింది నవం 20, 2026, 07:20 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం
ట్యాగ్‌లు
సంబంధిత వార్తలు






కామెంట్‌లు (0)