శుక్రవారం, 20 నవంబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

సమాజంలో మార్పు తెచ్చేలా సత్యసాయి సేవాదళ్ సేవలు

33 నిమిషాల క్రితం

సమాజంలో మార్పు తెచ్చేలా సత్యసాయి సేవాదళ్ సేవలు
సత్యసాయి జాతీయ సేవా సంస్థల అధ్యక్షుడు నిమిష్ పాండే image 1
వెబ్ డెస్క్

ప్రచురించబడింది నవం 20, 2026, 07:28 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం

ప్రజాశక్తి-పుట్టపర్తి అర్బన్

సత్యసాయి సేవాదళ్ సభ్యుడు సమాజంలో మంచి మార్పు తీసుకొచ్చే వెలుగుగా మారాలని సత్యసాయి జాతీయ సేవా సంస్థల అధ్యక్షుడు నిమిష్ పాండే పిలుపునిచ్చారు. పుట్టపర్తి శ్రీ సత్యసాయి బాబా జయంతి ఉత్సవల్లో భాగంగా శుక్రవారం నాడు ప్రశాంతి నిలయంలోని సాయి కుల్వంత్ హాలులో సత్యసాయి సేవాదళ్ మహా సమ్మేళనం ప్రారంభం అయ్యింది. రెండు రోజుల పాటు జరిగే కార్యక్రమాన్ని ట్రస్టు ప్రతినిధులు, సత్యసాయి సేవాదళ్‌ ‌ప్రతినిధుల నడుమ అట్టహాసంగా ప్రారంభించారు. కార్యక్రమంలో సత్యసాయి మేనేజింగ్ ట్రస్టీ ఆర్‌జె.రత్నాకర్, ట్రస్ట్ సభ్యులు చక్రవర్తి ఎన్ఎస్.నాగానంద, నిమిష్ పాండే పాల్గొన్నారు. అనంతరం జరిగిన సమ్మేళనంలో వక్తలు మాట్లాడుతూ ఉన్న స్థితి నుంచి ఉన్నత స్థితికి చేరాలంటే ప్రేమ, సేవ, దైవత్వం అనే అంశాలు ముడిపడి ఉంటాయన్నారు. ఈ సమ్మేళనం కేవలం సంస్థకు సంబంధించిన కార్యక్రమం మాత్రమే కాదని, సత్యసాయి బోధనలను గుర్తు చేసుకుంటూ మార్పు తెచ్చుకుని సేవా దళ్‌గా సమాజానికి సేవలు అందించాలన్నారు. మానవసేవయే మాధవసేవ అన్న సత్యసాయి బోధనను జీవితంలో ఆచరించి చూపించాలన్నారు. సేవ అనేది ఇంటి నుంచే ప్రారంభం కావాలనిసేవ చేస్తున్నామనే అహంకారానికి దూరంగా ఉండాలని సూచించారు. సేవకు నిజమైన ప్రతిఫలం ప్రశంసలు పురస్కారాలు కాదని నిస్వార్థ సేవ తోనే మనకు మనశ్శాంతి ప్రేమ ఆనందం ఇస్తుందని తెలిపారు. సేవాదళ్ ప్రేమతో అందించే సేవలోనే గొప్పతనం ఉంటుందన్నారు. సత్యసాయి బోధించే ప్రేమ ద్వారా దైవత్వాన్ని పొందాలని సేవ ఎప్పుడు ‌నిస్వార్థంగానే ఉండాలన్నారు. ఈ సమ్మేళనంలో దేశవ్యాప్తంగా 10వేల మంది ప్రతినిధులు పాల్గొన్నారు. అనంతరం సత్యసాయి విద్యార్థులు నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు అలరించాయి.

​

​

​

​

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్